సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.

#pantangiveeraswamy

Sep 18, 2026 - 17:10
Sep 18, 2026 - 17:47
 0  2

ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.

 కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.

 తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

 సూర్యపేట, సెప్టెంబర్ 18:-  హైదరాబాదు నుండి సూర్యాపేట మీదుగా అమరావతికి బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుల్లెట్ ట్రైన్ కు మార్గం కల్పించాలని కోరుతూ సూర్యాపేట బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల రోజులుగా సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరిని వీడి సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట మీదుగా ట్రైన్ సౌకర్యం కల్పిస్తే హైదరాబాద్ విజయవాడ,అమరావతి నగరాలకు మధ్యలో ఉన్న సూర్యాపేట ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. సూర్యాపేట ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ సౌకర్యం కల్పిస్తే పట్టణాభివృద్ధి తో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు,  రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులు అందరూ పార్లమెంటులో, అసెంబ్లీలో ఈ ప్రాంత ప్రజల పక్షాన ట్రైన్ సౌకర్యం కల్పించాలని  గొంతు ఎత్తాలని, అవసరమైతే రాజీనామాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జిల్లా కేంద్రం లో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి , ఖమ్మంపాటి అంజయ్య, రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రవణ్, జిల్లా ఉపాధ్యక్షులు అయితగాని  మల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333