బస్సు సౌకర్యం కోసం విద్యార్థుల నిరసన

Aug 5, 2026 - 16:26
 0  0
బస్సు సౌకర్యం కోసం విద్యార్థుల నిరసన

జోగులాంబ గద్వాల 5ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్. మండలం నీలిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని మా గ్రామానికి కల్పించాలని గ్రామస్థులతో కలిసి గార్లపాడు స్టేజి దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థులు మాట్లాడుతూ మా గ్రామంలో దాదాపు ప్రతి రోజు 50 మంది విద్యార్థులు మల్దకల్ మరియు ఇతర ప్రాంతాలకు చదువు కోసం వెళ్తుంటారు...ప్రతి రోజు ఇలా వెళ్ళడానికి మాకు చాలా కష్టమవుతుంది.. కాబట్టి ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం విద్యార్థుల కోసం చెర్లగార్లపాడు గ్రామం వరకు వచ్చే బస్సును మా గ్రామం వరకు నడపగలరని ఆర్టీసీ అధికారులని కోరారు.. అలాగే పలుమార్లు ఈ విషయం గురించి ఆర్టీసీ అధికారులకు విన్నవించగా రేపు పంపిస్తాం ఎల్లుండి పంపిస్తాం అని నిర్లక్ష్యం చేస్తున్నారు...కావున ఈ సమస్య పైన గ్రామ సర్పంచ్ మరియు స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవచూపి విద్యార్థుల కోసం మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించగలరని గ్రామస్థులు కోరుచున్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333