శ్రీ విజయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన చేనేత వస్త్ర పరిశ్రమల శాఖ సహాయ సంచాలకురాలు శ్రీమతి వి.ఇందిర.
జోగులాంబ గద్వాల 5 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా చేనేత మరియు వస్త్ర పరిశ్రమల శాఖ సహాయ సంచాలకురాలు శ్రీమతి వి. ఇందిర ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ విజయుడు జిల్లాలోని చేనేత రంగ పరిస్థితులు, చేనేత కార్మికుల సంక్షేమ పథకాలు, చేనేత సహకార సంఘాల పర్యవేక్షణ, నేతలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, అలాగే అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై శ్రీమతి వి. ఇందిరతో చర్చించారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు.