కొత్త సంవత్సరం వేడుకలపై పోలీసు వారి సూచనలు తప్పకుండా పాటించాలి

జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్

Dec 30, 2024 - 18:43
 0  10
కొత్త సంవత్సరం వేడుకలపై పోలీసు వారి సూచనలు తప్పకుండా పాటించాలి

 జోగుళాంబ గద్వాల 30 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-  గద్వాల్. జిల్లా పరిధిలో ప్రజలు  నూతన సంవత్సర వేడుకలను పోలీస్ వారి సూచనలను పాటిస్తూ ఇతరులకు ఇబ్బందులు కల్పించకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని  జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్  ప్రజలకు సూచించారు.  
 జిల్లా లో నూతన సంవత్సరము వేడుకలను పురస్కరించుకొని  ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అప్రమత్తమై పక్క కార్యాచరణతో విధులలో ఉంటారని, నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఏవరైన అతిక్రమించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ    హెచ్చరించారు.ఎక్కడ కూడా పోలీస్ అనుమతి లేకుండా ప్రజలను భయాందోలనకు గురిఅయ్యే విధంగా క్రాకర్స్ మరియు " ఆర్.కె స్ట్రా " సౌండ్సిస్టమ్, లేదా అత్యధిక మొతాదులో గల సౌండ్ సిస్టమ్ (డి.జె) ఏర్పాట్లు నిషేధించడం జరిగిందని, వృద్ధులు లేదా అనారోగ్యంతో బాదపడుతున్న వారికి ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు జిల్లా పరిధిలోని గద్వాల్ పట్టణo, ఐజ, శాంతి నగర్, అలంపూర్, ఎర్రవల్లి  పట్టణలతో పాటు మండల కేంద్రాలలో పోలీస్ అధికారులు సిబ్బంది విధులలో ఉంటారని, అలాగే గ్రామీణ ప్రాంతాలలో రాత్రంతా బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ గస్తీ నిర్వహించడం జరుగుతుందని,  కావున ఈ వేడుకల సందర్భంగా ప్రతీ వాహనాదారుడు తూ.చ తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా పోలీసు సిబ్బంది చర్యలు తీసుకోవడం జరుగుతుందని,  యువత ఆనందం వేడుకల పేరుతో మద్యం సేవించి  మత్తులో రోడ్లపై వేగంగా ఇష్టారాజ్యాంగా వాహానాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని, మైనర్ లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రుల పై కేసులు నమోదు అవుతాయని జిల్లా ఎస్పీ  సూచించారు.జిల్లా లోని ప్రధాన పట్టణాల కూడళ్లలో  ట్రాఫిక్ నియమాలు అమలు తీరును మరింత పటిష్టంగా అమలుపరచడం జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా ప్రధాన జంక్షన్లలో డ్రంకన్ డ్రైవ్ మరియు రోడ్లపై గస్తీ నిర్వహించడం  జరుగుతుందని అన్నారు.స్పెషల్ పార్టీలు డిసెంబరు 31 వ తేది నాడు  అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో సాయంత్రం 6 గంటల నుండి ప్రత్కేక పోలీస్ బృందాలను ఏర్పా టు చేసి వాహానాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టనున్నామని. డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భం గా ఫోటో గ్రాఫి మరియు వీడియో గ్రాఫీలు తీసిన తర్వాత వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, పోలీస్ వారి నిబంధనలు ఎవ్వరయిన అతిక్రమించిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరు గుతుందని అన్నారు.
 పోలీస్ వారి సూచనలు: 1) బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడం నిషేదం
2) మైనర్లు, యువకులకు బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కావున తల్లి దండ్రులు మైనర్ యువకులకు బైకులు ఇవ్వవద్దు. పట్టుబడితే కేసులునమోదు చేయడం జరుగుతుంది.
3) త్రిబుల్ రైడింగ్, సైలెన్స్ ర్ లను తీసివేసి వాహానాలు నడపడం శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వాహానాలు సీజ్ చేయనున్నారు.
4) అధిక వేగంతో వాహానాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం వుంది.
5)మద్యం తాగి వాహానాలు నడపొద్దు. జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ,స్పెషల్ తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తాము.
6) గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తే తిరగడం, వాహానాలతో ర్యాలీగా వెళ్లడం చేయరాదు.
పై ఆంక్షలను ఎవరైనా అతిక్రమించిన ప్రజల దృష్టికి వస్తే డయల్ -100 కు సమచారం అందించాలని తద్వారా తక్షణమే స్పందించి వారి పై కఠిన చర్యలు తీసుకోబడుతాయని, ఈ వేడుకలు ప్రజలు తమ ఇండ్లలో కుటుంబ సభ్యులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ  సూచించారు.

అదేవిధంగా 2025 సంవత్సరం లో  ప్రజలందరికీ మంచి కలగాలని ఆశీస్తూ జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333