అలంకారప్రాయంగా మారిన తాగునీరు.
ఇతర సౌకర్యాలు లేకపోయినా పర్లేదు..
కనీస తాగునీటిని కల్పించండి.*
ప్రయాణికుల ఆవేదన.
జోగులాంబ గద్వాల17 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- అయిజ. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో తాగునీరు లేదు. అలంకారప్రాయంగా ఫిల్టర్ నీరు, అత్యధిక ఆదాయ వనురులు సమకూరుతున్న, ప్రజలకు సౌకర్యాలు మాత్రం..అందడం లేదు. బస్టాండ్ లో సీసీ రోడ్డు లేదు. తూతూ మంత్రంగా అప్పటికప్పుడు పనులు చేయడం విడిచిపెట్టడం, శాశ్వత పనులు ఇంతవరకు ఏమీ జరగలేదు. ఇక్కడి నుంచి రాయచూరుకు తెలంగాణ బస్సులు లేవు. కర్ణాటక బస్సులే దిక్కు. తాగే నీరు లేక సౌకర్యాలు లేక త్రాగునీటిని బస్టాండ్ బయట కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి. దీని గురించి ఆర్టీసీ అధికారులు కానీ డిఎం గాని ఈ విషయాలు తెలిసిన తెలియనట్టు మిన్న కుండి పోతున్నారు. ఆదాయం వస్తుంది కదా, ఇబ్బంది వారు పడతారు మనకేంటి లే అన్నట్టు ఆర్టీసీ వారి తీరు, ఎన్నిసార్లు అధికారులతో విన్నవించుకున్న ఎటువంటి ఉపయోగం లేదని వాపోతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించి కనీసం తాగునీరు మిగతా విషయాల పట్ల అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరిస్తారని ప్రయాణికులు ఆశిస్తున్నారు.