కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన""జిల్లా ఎస్పీ కే నరసింహం ఐపిఎస్
కోదాడ టౌన్ 17/3/2026._కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
- *ఫిర్యాదులు, కేసులు పెడింగ్ ఉంచకుండా పని చేయాలి.*
- *ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక.*
- *రంజాన్, ఉగాది పండుగ సందర్బంగా ప్రజలు ఉత్సవాలు కలిసిమెలిసి జరుపుకోవాలి.*
-.... సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్.
తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ రావెళ్ళ::జిల్లాలోని పోలీస్ స్టేషన్లో తనిఖీలు భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనకి చేసినారు. తనకి లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ నందు నిర్వహిస్తున్న రికార్డ్స్, ఫిర్యాదుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, కమ్యూనిటీ కార్యక్రమాలు, సీసీ కెమెరాల నిర్వహణ ను పరిశీలించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులను, పెండింగ్ ఫైల్స్ పరిశీలించాలని సూచించారు. ఈ సందర్భంగా రికార్డ్ నిర్వహణ, పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం ట్రాఫిక్ పునరుద్ధరణ అంశాల గురించి పట్టణ పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకు సలహాలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఫిర్యాదుదారుల ఫిర్యాదులపై వేగంగా స్పందించి వారికి భరోసా కల్పించాలని కేసులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు వేగంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పని చేయాలని అన్నారు. ప్రజా చైతన్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు భద్రత పట్ల, సైబర్ మోసాల పట్ల, సామాజిక భద్రత పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. కోదాడ పట్టణంలో ట్రాఫిక్ నిర్వహణ అవతరణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ప్రజలకు వాహనదారులకు సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సంబంధిత మున్సిపాలిటీ అధికారులతో కలిసి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాపార నిర్వహకులు రోడ్లపై వస్తువులు పెట్టి అమ్మకూడదని రోడ్లను ఆక్రమించడం వల్ల వచ్చి పోయే వాహనాలకు సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. రంజాన్ దసరా పర్వదినాలు ఒకేసారి వస్తున్నందున ప్రజలు ఒకరికొకరు సోదరా భావంతో ఉంటూ మతాలకతీతంగా ఉత్సవాలను కలిసి మెలిసి జరుపుకోవాలని కోరారు. ప్రజల భద్రతలో పోలీస్ శాఖ అనునిత్యం కృషి చేస్తుంది అన్నారు.
ఎస్పీ వెంట కోదాడ డివిజన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐ లు సుదీర్, చిన్న మాల్సూర్, ట్రాఫిక్ ఎస్ఐ అంజి రెడ్డి, సిబ్బంది ఉన్నారు.