వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు డాక్టర్"భార్గవి

Apr 2, 2026 - 19:53
Apr 2, 2026 - 20:45
 0  47
వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు డాక్టర్"భార్గవి

వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు డాక్టర్"భార్గవి

అడ్డగూడూరు 02 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అడ్డగూడూరు ఆధ్వర్యంలో బిపి, షుగర్,క్యాన్సర్,టీబీ వ్యాధులు ఉన్నవారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు.ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ పాశం విష్ణు వర్ధన్ రావు ప్రారంభించి మాట్లాడుతూ..ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతంగా జీవించాలని ఆయన అన్నారు.అనంతరం ఆయా వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్"భార్గవి మెడికల్ ఆఫీసర్,శారధ పీహెచ్ఎన్, సరోజన సూపర్వైజర్, వెంకట రమణ ఏఎన్ఎం సురంభా, సరిత,శోభ ఆశాలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.