సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలి
పాపన్న గౌడ్ పోరాట చరిత్ర మరవలేనిది.
సర్వాయి పాపన్న నేటి యువతరానికి ఆదర్శం
తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్.
సూర్యాపేట 02 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో దళిత బహుజనులు రాజా అధికారం కోసం ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాపన్న గౌడ్ 317 వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రత్నాపూర్ గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలా లేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మొగల్ చక్రవర్తుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నాడు పోరాటం చేసి గోల్కొండ కోటను ఏలిన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం హర్ష నియమన్నారు.
12 మందితో ఏర్పాటైన పాపన్న గౌడ్ సైన్యం 12,000 మంది సైన్యాన్ని తయారుచేసి బహుజన రాజ్యాన్ని నెలకొల్పిన చరిత్ర ఆయనకే దక్కిందన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, ప్రతీక అన్నారు.పాపన్న గౌడ్ చరిత్రను ప్రతి ఒక్క బహుజన బిడ్డ తెలుసుకొని భవిష్యత్ తరాలకు అందించాలని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాలలో ముద్రించాలని కోరారు. తెలంగాణ ప్రాంతాలలోనీ అన్ని 33 జిల్లా కేంద్రాలలో పాపన్న గౌడ్ విగ్రహాలను నెలకొల్పడంతోపాటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పుట్టిన జనగామ జిల్లా కు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలి పేర్కొన్నారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక ఎకరం స్థలంలో ఉద్యానవనం కూడా నిర్మించాలని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ గౌరవ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్. రాష్ట్ర కోశాధికారి పాల సైదులు రాష్ట్ర సహాయ కార్యదర్శి బుడిగ నవీన్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలదరుడు దేవత్ కిషనాయక్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఖమ్మం పాటి అంజయ్య గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య అయితే గాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు మాది రెడ్డి గోపాల్ రెడ్డి బానోతు జానీ నాయకు కొత్తపల్లి వెంకన్న పట్టేటి కిరణ్ శ్రీనివాస్ రెడ్డి రాపర్తి జానయ్య శ్యామ్ సారగండ్ల కోటేషూ తదితరులు పాల్గొన్నారు.