వైరస్ వస్తుందట (వచ్చిందట )
వైరస్ మల్లి వస్తుందట (వచ్చిందట )
అది కరోనా నుండి మొదలైంది
కన్నీరు కూడ బరువైంది
కడుపుకోత మిగిలింది
ఎన్నో కుటుంబాలను ఆగం చేసింది
చైనాలో పుట్టిందట
మనకు వస్తుందట,ఆని
ఆనోట ఈనోట వినబడుతుంది
అలజడి మొదలైంది
అప్రమత్తమని హెచ్చరికలు
నిపుణులు, డాక్టర్లు
ప్రభుత్వం,సాదారణ వైరస్ అంటుంది,పాతదే ఆని చెపుతుంది, జాగ్రత్తలు తీసుకొమ్మని పిలుపునిస్తుంది
ఆందోళన వద్దు అంటుంది
ప్రజలు పుకారులను నమ్మొద్దు
గాలి వార్తలను వినవద్దు
ఆగమాగం కావద్దు
అదే నిజమని ప్రచారం చేయొద్దు
మానసికంగా కృంగి పోవద్దు
ప్రభుత్వ ప్రకటన చూడాలి
నిపుణుల మాట వినాలి
నిజం తెలుసుకోవాలి
జాగ్రతలు తీసుకోవాలి
ప్రతి రోజు పరిశుభ్రతను పాటించాలి
ఒకవేళ వైరస్ ఏ రూపములో వచ్చిన
ఎదురుకొనాలి, నివారించాలి
ప్రభుత్వం అప్రమత్తమై
ప్రజలను ఆదుకోవాలి.
రచన.
కడెం. ధనంజయ
చిత్తలూర్