భక్త జనం భద్రం మీ ప్రాణం

Jan 9, 2025 - 12:07
Jan 10, 2025 - 16:58
 0  72
భక్త జనం భద్రం మీ ప్రాణం

భక్త జనం భద్రం మీ ప్రాణం 

భక్తులకు విజ్ఞప్తి 
భగవంతుడి కృప కొరకు 
అందరు తపిస్తారు 
దర్శనభాగ్యానికి 
దారులు వెతుకుంటారు 

కోరికలు కోరుకుంటారు 
మొక్కులు తీర్చుకుంటారు 
వివిధ మార్గాలలో 
చేరుకుంటారు, ఇష్టంగా 
భక్తిని చాటుకుంటారు 

సహనం ఉండాలి 
ఓర్పుతొ పనిచేయాలి 
ఎవరిని నొప్పించక 
తమ పని తాము చేస్తుపోవాలి 
భగవంతుడి కరుణకటాక్షము పొందాలి 

క్రమశిక్షణ పాటించాలి 
క్యూ లైన్లో నిలబడాలి 
టోకెన్లను పొందాలి 
దేవుడి దర్శనముతో 
జన్మ తరించిపోవాలి 

తొందరపాటుతనం 
తొక్కిసలాటకు దారితీస్తుంది 
పసిపిల్లలతో సహా పెద్దవారి 
ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది 
విషాదం చోటుచేసుకుంటుంది 

భక్తులు విజ్ఞతతో ఆలోచించాలి 
ప్రభుత్వానికి,సిబ్బందికి సహకరించాలి, ప్రమాదలను నిలువరించాలి, తగు ఏర్పాట్లతో 
పాలకులు సౌకర్యాలను కలిపించాలి.

రచన.
కడెం. ధనంజయ 
చిత్తలూర్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333