ఐ.ఎస్.సదన్ డివిజన్ భాను నగర్ కాలనీ పార్కులో ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన కార్పొరేటర్ శ్వేత మధుకర్ రెడ్డి

హైదరాబాద్;20 సెప్టెంబర్ 2025 శనివారం తెలంగాణ వార్త రిపోర్టర్:- ఐ.ఎస్.సదన్ డివిజన్ పరిధిలోని భాను నగర్ కాలనీ పార్క్ లో ఓపెన్ జిమ్ ను డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి చేత ఘనంగా ప్రారంభించారు.కార్పొరేటర్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యం అనే మాటను గుర్తు చేశారు.ప్రతి రోజు వ్యాయామం చేయడం ద్వారా మానసిక ఉల్లాసం మరియు మన శరీరం దృఢంగా మృదువుగా మారుతుంది అని తెలిపారు.ప్రతిరోజు వాకింగ్ చేస్తే బి.పి, షుగర్ లాంటి సమస్యలను కొంతవరకు అరికట్టవచ్చని చెప్పారు.భాను నగర్ కాలనీలో లేదా పార్కులో ఎలాంటి సమస్యలున్న మా దృష్టికి తీసుకురండి వెంటనే తగు పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా పార్కులో ఓపెన్ జిమ్ ను ప్రారంభించినందుకు కార్పొరేటర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి,శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, కోశాధికారి వేణుమాధవ్ రెడ్డి, ఆర్గనైజర్స్ వినోద్ కుమార్, నరేష్ నాయక్, సి.వి.యన్ రెడ్డి, కాలనీ కమిటీ సభ్యులు డాక్టర్ సుధాకర్ రెడ్డి,వి. నరసింహారెడ్డి, జగత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.