అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ
మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి
ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక అని మాజీమంత్రివర్యులు,కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి,ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గార్లు అన్నారు.
బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖాసీంపేట 4వ వార్డ్ లోని హక్స మసీద్ లో రంజాన్ మాసం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసి ఇఫ్తార్ విందులో పాల్గొని ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు రోజ విడిపించారు.
అనంతరం వారు మాట్లాడారు 14 శాతం సూర్యాపేటకు వచ్చే నిధులను మైనార్టీలకు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని మతాలకు స్వేచ్చాయుత వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించిందని, ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసిన హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతోనే ముందుకు సాగాలని, ఖాసీంపేట గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించిన విధంగానే, రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, స్థానిక కౌన్సిలర్ జాటోతు లక్ష్మీమకట్ లాల్, 4వ వార్డ్ ఇంచార్జి ధారవత్ నాగునాయక్, వక్స్ బోర్డ్ మాజీ వైస్ చైర్మన్ సిద్ధిక్, సలీంఅప్ ఖాన్, జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ నసీరుద్దీన్, కాసిం అలీ,పాషి,నాగుల్,నజీర్ బాబా,బిక్షం,వెంకటాచారి, దుర్గయ్య, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.