సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేసేది ఎప్పడు ఎమ్మార్సీ తాళాలు తీసేది ఎప్పుడు
మూతపడ్డ మండల విద్యా వనరుల కేంద్రం..
జోగులాంబ గద్వాల 21 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎర్రవల్లి మండలం గత 15 రోజులుగా ఎర్రవల్లి మరియు ఇటిక్యాల మండలాల సమగ్ర శిక్ష ఉద్యోగులు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తమ యొక్క ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని సమ్మె చేయడం జరుగుతుంది. సమ్మెలో భాగంగా G O, కాపీ వచ్చేవరకు విధుల్లో చేరేది లేదని ఇటిక్యాల మరియు ఎరవల్లి మండల విద్యా వనరుల కేంద్రానికి తాళం వేసి 13 రోజులుగా పూర్తి స్థాయిలో సమ్మెకు దిగారు. అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన మాట ప్రకారం అందరినీ రెగ్యులర్ చేయాలని ఇటిక్యాల మరియు ఎరవల్లి మండల సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేదంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వారు అన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం మీద తమకు పూర్తి నమ్మకం ఉందని , గౌరవ ముఖ్యమంత్రి వెంటనే చొరువ తీసుకొని మా బతుకుల్లో మరియు మా జీవితాల్లో వెలుగు నింపుతాడని ఆశిస్తున్నామని వారు అన్నారు