గద్వాల జిల్లా ఆసుపత్రిలో దోపిడీ, అన్యాయానికి గురవుతున్న కార్మికులు.

Jul 1, 2024 - 18:58
 0  34
గద్వాల జిల్లా ఆసుపత్రిలో దోపిడీ, అన్యాయానికి గురవుతున్న కార్మికులు.
గద్వాల జిల్లా ఆసుపత్రిలో దోపిడీ, అన్యాయానికి గురవుతున్న కార్మికులు.

జోగులాంబ గద్వాల 1 జులై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల .జిల్లా కేంద్రంలోని అక్రమంగా విధులనుంచి తొలగించిన కార్మికులను వెంటనే తీసుకో వాలనికాంట్రాక్టరును రద్దు చేయాలని నిరసన ధర్నా  ప్రభుత్వాసుపత్రుల కార్మికుల సమస్యలపై జూలై 3న హైదరాబాద్ డీఎంఈ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయాలని, అలాగే గద్వాల ఆసుపత్రి లో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ధర్నా కు అనుమతి ఇవ్వాలని కోరుతు ఈరోజు సూపరింటెం డెంట్ కు విజ్ఞప్తి నోటిస్ ఇచ్చిన కార్మికులు  ఈసందర్బంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయుచున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు అందవలసిన జీతాలు సక్రమంగా ఇవ్వకుండా కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై కార్మికుల్ని దోచుకుంటున్నారని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు విమర్శించారు.ప్రభుత్వాసుపత్రుల కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం  రూ. 15600/-లు కాగా పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవ్వగా 13,600 రావాల్సి ఉన్నప్పటికీ కేవలం రూపాయలు 11000 మాత్రమే చెల్లిస్తున్నారని వారు ఈ సందర్భంగా విమర్శించారు. అధికారులు జీవో ప్రకారం టెండర్ పిలిచి కార్మికుల జీతాలు సక్రమంగా అందుకున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకే జూలై మూడవ తేదీన డిఎమ్ఈ క్యాంపు ఆఫీసులో ధర్నా నిర్వహించినట్లు వారు వివరించారు. పీఎఫ్ సక్రమంగా చెల్లించటం లేదని, కాంట్రాక్టు లేబర్ చట్టం ప్రకారం నాలుగు పండుగ సెలవులు, నాలుగు జాతీయ సెలవులు, 16 వరకు ఆర్జిత సెలవులు అందవలసి ఉన్నప్పటికీ ఏ ఆసుపత్రిలో కూడా కార్మికులకు సెలవులు ఇవ్వకుండా వారిని శ్రమదోపిడికి గురి చేయుచున్నారని వారు విమర్శించారు. కాంట్రాక్టర్ల అవినీతిని అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టిందికే జూలై మూడవ తేదీన కోటి డిఎంఈ కార్యాలయంలో ధర్నా నిర్వహించనున్నట్లు వారు వివరించారు. గత ప్రభుత్వంలో విడుదల చేసిఅమలు చేయకుండా నిర్లక్ష్యం చేసినటువంటి జీవో నెంబర్ 21ని అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, కిందిస్థాయి కార్మికుల అక్రమ తోలయింపులను అరికట్టాలని, కార్మికులపై కాంట్రాక్టర్లు, అధికారుల వేధింపుల్ని మానివేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు.


 ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి,సూపర్ వైజర్స్ బాషా, నాగరాజు, యూనియన్ రాష్ట్ర సమితి సభ్యులు చామంతి, లక్ష్మణ్, నరసింహ, కార్మికులు పరుశరామ్,సుధాకర్, ఏఐటీయూసీ నాయకులు బుల్లెట్ వెంకట్ రెడ్డి,లక్ష్మి, బాష, కన్న, వెంకటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333