వెల్దేవి గ్రామ మహిళలకు జిల్లాస్థాయి బహుమతి

Jul 19, 2026 - 20:40
Jul 19, 2026 - 20:40
 0  52
వెల్దేవి గ్రామ మహిళలకు జిల్లాస్థాయి బహుమతి
వెల్దేవి గ్రామ మహిళలకు జిల్లాస్థాయి బహుమతి

అడ్డగూడూరు 19 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామ మహిళలకు జిల్లాస్థాయి త్రో బాల్ లో నాలుగో బహుమతి అందుకున్నారు.శనివారం రోజు భువనగిరి నడిబొడ్డున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఈషా ఫౌండేషన్ 18వ గ్రామీణోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాల నుండి గ్రామీణ మహిళలు పోటీలో పాల్గొన్నారు.ఇందులో మారుమూల గ్రామమైన వెల్దేవి గ్రామ మహిళలు బహుమతి అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కొంతమంది మహిళలు మాట్లాడుతూ.. రాబోయే రోజులలో మా గ్రామం నుండి రాష్ట్రస్థాయికి ఆటలు ఆడడానికి మేము కృషి చేస్తామని అన్నారు. గ్రామాలలో కూలి నాలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మేము ఒక్కరోజు మేము పని మాలి ఆటలు ఆడుతుంటే మాలో ఉన్న బాధలన్నీ మర్చిపోయాలా చేస్తున్నాయని అన్నారు.ఆటలు అడడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని.. అనారోగ్యానికి తావు ఉండదని తెలిపారు. మాలో ఉన్న బాధలన్నీ మర్చిపోయి ఆరోగ్యం కొరకు ఎఆట ఆడడానికైనా సిద్ధంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈషా ఫౌండేషన్ సభ్యులు, స్వచ్ఛంద సేవ సభ్యులు, అధికారులు, పిఈటి లు, వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలు, క్రీడాకారులు,ఈషా ఫౌండేషన్ సంఘ సభ్యులు మార్త నరేష్, ఆర్.ఎం.పి డాక్టర్ నిమ్మల రమేష్ గౌడ్, కడియం రవివర్మ, నిమ్మల పవన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.