బెజవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన నూతనకల్ మహిళ భక్తులు

Jul 19, 2026 - 20:43
Jul 19, 2026 - 20:43
 0  9
బెజవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన నూతనకల్ మహిళ భక్తులు

నూతనకల్ 19 జులై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట జిల్లా మండల కేంద్రానికి చెందిన జీలకర్ర పుష్పలత, వరిగళ్ళ ఉపేంద్ర, నరసమ్మ, భాగ్యలక్ష్మి ఆషాడ మాసం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి వస్త్రాలు సమర్పించడానికి ఆదివారం రోజు బయలుదేరారు. నూతన వస్త్రాలు, ఒడిబియ్యం,పువ్వులు, 5 రకాల పండ్లు, 3 రకాల స్వీట్ డబ్బాలు,101తమలపాకులు, అద్దం,దువ్వెనే, కాటుకయ, గాజులు,పెద్దది 108నిమ్మకాయ దండ, చిన్నది 51 నిమ్మకాయ దండ, గోరింటా కు సమర్పించారు. మహిళ భక్తులు మాట్లాడుతూ.. అమ్మవారి కనకదుర్గమ్మకు ఇలా సమర్పిస్తే ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో,నిండా నూరేళ్లు పిల్ల పాపలతో, చల్లగా వర్ధిల్లుతారని ఎల్లకాలం ముత్తేద తనంతో ఉంటారని నమ్మకంతో వస్త్రాలు సమర్పించడం జరిగిందని అన్నారు.