బుల్లెట్ ట్రైన్ సాధనకై ఐక్యంగా ఉద్యమించాలి. 

Jul 19, 2026 - 20:14
Jul 19, 2026 - 20:44
 0  5
బుల్లెట్ ట్రైన్ సాధనకై ఐక్యంగా ఉద్యమించాలి. 

 దశలవారీగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం....

 జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తాం...

 ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ఆరుట్ల జానకి రెడ్డి.

సూర్యాపేట: సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధన కు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకి రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్  లో  జరిగిన  అఖిలపక్ష పార్టీలు,ప్రజా సంఘాల తో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట వంటి ప్రధాన వాణిజ్య, విద్యా, పారిశ్రామిక కేంద్రాన్ని బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ నుంచి తొలగించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదు దశాబ్దాలుగా సూర్యాపేటకు రైల్వే సౌకర్యం వస్తుందని చెబుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ కల నెరవేరలేదన్నారు. తాజాగా ప్రతిపాదిత మూడో అలైన్‌మెంట్‌లో సూర్యాపేటను పక్కన పెట్టడం ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను దెబ్బతీసిందని పేర్కొన్నారు.

సూర్యాపేట పట్టణానికి ఉన్న వాణిజ్య ప్రాధాన్యం, జనాభా, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, రైస్ మిల్లులు మరియు జాతీయ రహదారి 65పై ఉన్న వ్యూహాత్మక స్థానాన్ని దృష్టిలో ఉంచుకొని బుల్లెట్ ట్రైన్ మార్గంలో సూర్యాపేటను తప్పనిసరిగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ సాధన కోసం దశలవారీగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులపై  ఒత్తిడి తీసుకువచ్చి సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధిస్తామని అన్నారు. అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణ, ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

ఈనెల 20న బుల్లెట్ ట్రైన్ సాధనకై సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా ధర్నాకు ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.   బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ గా ఆరుట్ల జానకి రెడ్డి ఎన్నిక బుల్లెట్ ట్రైన్ సాధనకై నూతన కమిటీని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్నుకున్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ గా ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆరుట్ల జానకి రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు గౌరవ సలహాదారులుగా పెద్దిరెడ్డి గణేష్, చెన్నోజు రమణాచారి ని ఎన్నుకున్నారు. అన్ని పార్టీలు ప్రజా సంఘాల నుండి కో కన్వీనర్ గా ఎన్నుకున్నారు.

 ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ, పెద్దిరెడ్డి రాజా, మల్లు నాగార్జున రెడ్డి, మండారి డేవిడ్ కుమార్, కొత్తపల్లి శివకుమార్, బూర వెంకటేశ్వర్లు, వరికుప్పల వెంకన్న, గట్ల రమాశంకర్, ఇస్మాయిల్, మీలా మహదేవ్, కొల్లి మధుసూదన్ రావు, డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, నూకల సుదర్శన్ రెడ్డి, అనువులపురి రవిబాబు, పెద్దిరెడ్డి గణేష్, తల్ల మల్ల హసేన్, చిన్నోజు రమణాచారి, మట్టి పెళ్లి సైదులు, భూపతి రాములు, పేర్ల నాగయ్య, తుక్కాని మన్మధ రెడ్డి, చల్లమల్ల నరసింహ, అనంతుల మధు,రేపాక లింగయ్య, ఆవుల నాగరాజు, పోలే బోయిన కిరణ్, గుండాల సందీప్, నవిల ఉపేందర్, ధనియాకుల శ్రీకాంత్, సట్టు నాగయ్య, నల్లెడ మాధవరెడ్డి, ఎండి ఫక్రుద్దీన్, తంగుళ్ల జనార్ధన్, బోల్లెద్దు వెంకటరత్నం, నీలా శ్రీనివాస్, షేక్ నజీర్, నారా బోయిన వెంకట్, కక్కిరేణి చంద్రశేఖర్, మధు గౌడ్, కరీం, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333