వివిధ రంగాల కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి"సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు

Oct 18, 2024 - 17:17
Oct 18, 2024 - 18:45
 0  7
వివిధ రంగాల కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి"సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు

తెలంగాణ వార్త ప్రతినిధి:- వివిధ రంగాల కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలి*

 సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు

రాష్ట్రంలో ఉన్న స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వారికి కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 

స్థానిక కోదాడ సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం ఎం రాంబాబు అధ్యక్షతన జరిగింది 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న స్కీం వర్కర్లు మధ్యాహ్న భోజనం అంగన్వాడీ ఆశ ఇతర కార్మికులకు కనీస వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించిన బిల్లులు కానీ వేతనాలు కానీ గుడ్డుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయకుండా పిల్లలకు పరిపుష్టిగా ఆహారం అందించాలని ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి కనీస వేతనాలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను ప్రభుత్వం వెంటనే నియంత్రణ చేయాలని ఈనెల 17 నుండి 28 వరకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి ధర్నాలను జయప్రదం చేయాలని ఈ ధర్నాకు వివిధ రంగాలకు సంబంధించిన కార్మికులు ప్రజలు హాజరుకావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు పని భద్రత కరువైందని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటూ కనీస వేతనం అమలు చేయడం లేదని ప్రభుత్వం వారికి వెంటనే కనీస వేతనం 26,000 అమలు చేయాలని వారు అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందని భవిష్యత్తులో జరగబోయే కార్మికుల పోరాటాలలో అన్ని రంగాల కార్మికులు చైతన్యమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పైన పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని వారన్నారు .ఈ యొక్క సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్ రాంబాబు కోశాధికారి కోటగిరి వెంకట్ నారాయణ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రాధాకృష్ణ సహాయ కార్యదర్శి శీలం శ్రీనివాస్ ఎలక సోమయ్య జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు తదితరులు పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State