కార్మిక చట్టాల సవరణతో కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర.కార్మిక సంఘాలు
జోగులాంబ గద్వాల 21 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాల సవరణ ద్వారా ప్రస్తుత భవిష్యత్ కార్మికులను యజమానులకు పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జయలక్ష్మి హెచ్చరించారు మే 20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు చెంప పెట్టు కావాలని అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్లో tuci జిల్లా కార్యదర్శి m.కృష్ణ అధ్యక్షతన జరిగిన జిల్లా సన్నాహక సదస్సు కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని జిల్లా కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కార్మిక వర్గానికి కనీస వేతనాలు ఇవ్వకపోగా కార్మిక చట్టాలను సవరించి ప్రశించే హక్కును సంఘాలు ఏర్పాటు చేసే హక్కును రద్దు చేస్తున్నారని ధ్వజమెత్తారు కార్మిక చట్టాలను అమలు చేస్తే 8 గంటల స్థానంలో 12 గంటల పని దినాలు అమలు అవుతాయని అన్నారు. కార్మికులపై పని గంటలు పెంచి పెట్టుబడిదారులకు ఆదాయాన్ని సమకూర్చడానికి కేంద్రమే కార్మిక చట్టాలను తీసుకొస్తున్నదని విమర్శించారు సవరించిన కార్మిక చట్టాలు అమలులోకి వస్తే సంపద కేంద్రీకరణ పెరుగుతుందని ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతలు పెరుగుతాయని హెచ్చరించారు. కార్మిక వర్గం కార్మిక చట్టాల సవరణపై తిరగబడకపోతే కార్మికులు యజమానులు పెట్టుబడిదారులకు బానిసలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. చట్టాలు అమలులోకి వస్తే ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరణ విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు చట్టాల వల్ల రిజర్వేషన్లు ఎత్తివేస్తారని దీని వల్ల సామాజిక వివక్ష ఇంకా పెరుగుతుందని హెచ్చరించారు. కార్మిక వర్గ ఐక్యత సమరశీల పోరాటాల ద్వారా మాత్రమే కార్మిక చట్టాల సవరణకు ఇన్ని సంత్సరాలుగా కేంద్రం వెనుకడుగు వేసిందని కానీ మళ్ళీ ఇప్పుడు చట్టాల సవరణ కు పార్లమెంటు ఆమోదం ద్వారా మరోసారి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని అన్నారు దేశం ఎదుర్కొంటున్న అనేక రకాల సంక్షోభాలను పెడచెవిన పెట్టి కార్మిక చట్టాల సవరణ ద్వారా పెట్టుబడుదారి సేవలో తరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే ఈ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా AITUC TUCI CITU IFTU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.ఆంజనేయులు హన్మంతు కృష్ణ ఏ.వెంకటస్వామి వివి నరసింహ హలీం పాషా మాట్లాడుతూ సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వారి ప్రజాతంత్ర హక్కుల పరిరక్షణకు కేంద్ర కార్మిక సంఘాల ఇచ్చిన సార్వత్రిక సమ్మె ను జిల్లాలో క్షేత్ర స్థాయిలో గ్రామ గ్రామానికి కి తీసుకెళ్లి విజయవంతం చేయడానికి ఐక్యంగా ముందుకు వెళ్లాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు కార్మిక సమ్మెకు మద్దతుగా గ్రామీణ కర్షకులు ఈ సమ్మెలో పాల్గొని సమ్మె జయప్రదానికి కృషి చేయాలని కోరారు ఈ సదస్సులో కార్మిక సంఘాల నాయకులు సునీత పద్మమ్మ ఎల్కూరు రంగన్న ఉప్పేర్ నరసింహ చింతరేవుల కృష్ణ చంద్రములు సునీత గట్టన్న ధర్మన్న రంగన్న రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు .