మెగా ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Feb 25, 2025 - 19:34
 0  2
మెగా ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలి  ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

తెలంగాణ వార్త మిర్యాలగూడ ఫిబ్రవరి 25 : ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో  రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు  మరియు లయన్స్ క్లబ్ వారిఆధ్వర్యంలో  స్టార్ హాస్పిటల్ వారిచే నిర్వహించిన  మెగా ఉచిత వైద్య శిబిరం  మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి  రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు  ఈ సందర్భంగా  మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో పేద కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి మరియు లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు  అలాగే మెరుగైన వైద్యులతో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే లయన్స్ క్లబ్ వారు మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు మిర్యాలగూడ నియోజకవర్గంలో పేద ప్రజల కోసం ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని అన్నారు   అలాగే మిర్యాలగూడ పట్టణంలోని గ్రంథాలయంలో  ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతలో చాలామంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి వారికి తోడుగా ఉండాలని వారిని కోరడం జరిగింది
వెంటనే సానుకూలంగా స్పందించి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ వారు అతిత్వరలో కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు

     ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్, లయన్స్ క్లబ్ సభ్యులు, డాక్టర్స్, స్టార్ హాస్పిటల్ సిబ్బంది,  కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333