పరువు హత్య తీర్పు ఒక గుణపాఠం కావాలి
చీకూరి లీలావతి విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు

పరువు హత్య తీర్పు ఒక గుణపాఠం కావాలి
ప్రణయ్ కుటుంబానికి రక్షణ కల్పించాలి...
మిర్యాలగూడలో కుల దురహంకార హత్యకు బలైన పెరుమాళ్ళ ప్రణయ్ హత్య కేసు తీర్పు కుల దురహంకారులకు చెంపపెట్టు లాంటిదని కోర్టు తీర్పు వెలువడిన తర్వాత విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చీకూరి లీలావతి విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
నల్గొండ జిల్లా మిర్యాల గూడలో 2018లో వైశ్య కులానికి సంబంధించిన అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే పేరిట పెరుమాండ్ల ప్రణయ్ అనే దళిత యువకుడిని అత్యంత కిరాతకంగా కోటి రూపాయలు ఇచ్చి హత్యగావింపజేశారని ఆమె అన్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న మారుతి రావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడని మిగిలిన ఏడుగురు నిందితులలో ఏ2 శర్మకు ఉరిశిక్షతోపాటు మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించి ఇచ్చిన తీర్పును విన్నపం ఒక పోరాటం సంపూర్ణంగా స్వాగతిస్తుందన్నారు. కోర్టులపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ప్రణయ్ తీర్పు ఉందన్నారు. ఈ తీర్పు తర్వాత ప్రణయ్ కుటుంబానికి అమృత బాలస్వామికి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని వారు కోరారు. రాష్ట్రంలో 128 కుల దురహంకార హత్యలు జరిగాయన్నారు. నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు మిగిలిన చోట జరిగిన కుల దురహంకారులకు కనువిప్పు కలగాలన్నారు కుల దురహంకారులను పౌర సమాజం ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాలని ఆమె అన్నారు..
పరువు కోసం హత్యలు చేసి చివరికి మీ పరువు మీరు తీసుకొని ప్రాణాలు కోల్పోయి మీకు సహకరించిన వారి ప్రాణాలను, జీవితం లను బలి తీసే మీకు పరువు ఎక్కడిది పరువు అనే చెప్పుకొని తిరిగేవాళ్లు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అన్నారు.
కులాంతరమంతా వివాహాలు చేసుకున్న పరువు కోసం ప్రాణాలు తీయకుండా వారి జీవితం బతికే విధంగా వదిలేయండి. ప్రాణాలను తీస్తే పరువు పోవటం కాదు. చట్ట మిమ్మల్ని ఊరికే వదలదు ప్రాణాలు కూడా పోతాయి మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఒక గుణపాఠం కనిపిస్తుంది.
బిడ్డల జీవితాలను బలి తీయడమే పరిష్కార మార్గం కాదన్నది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అని చీకూరి లీలావతి విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు అన్నారు..