నిన్న జమ్మిచేడు నేడు కిష్టాపురం
జోగులాంబ గద్వాల 11 మార్చ్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లాలోని ఇలా రోజుకు ఏదో ఒక చోట బొలేరోలు, ఆటోలకు ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటుంది. అయిజ మండలం కిష్టాపురం గ్రామం సమీపంలో కూలీల ఆటో బోల్తాపడి కూలీలకు గాయాలు. ముగ్గురికి తీవ్రగాయాలు, 8 మందికి స్వల్ప గాయాలు. గాయపడిన వారిని చికిత్స కోసం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. సోమవారం జమ్మిచేడులో ఆటో బోల్తా పడిన ఘటనలో 5మందికి తీవ్రగాయాలు, 10మందికి స్వల్పగాయాలయ్యాయి. జమ్మిచేడు ఘటన మరువకముందే మంగళవారం కిష్టాపురంలో మరో బొలేరో బోల్తా పడింది. నిత్యం పదుల సంఖ్యలో కూలీలను బొలేరో, ఆటోలలో తరలిస్తున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.