మరణించిన పోలీసు కుటుంబాలకు తోటి సిబ్బంది ఆర్థిక సాయం
ఎస్పి నరసింహ ఐపిఎస్ గారి చేతుల మీదుగా కుటుంబసభ్యులకు నగదు అందించిన 2012 బ్యాచ్ సూర్యాపేట సివిల్ పోలీస్ సిబ్బంది.
ఈ రోజు సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆఫీసు నందు 2012 బ్యాచ్ కానిస్టేబుల్స్ ఏర్పాటు చేసి నటువంటి, "చేయూత పోలీస్ అసోసియేషన్ 2012బ్యాచ్ "ద్వారా ఇటీవల అకాల మరణం చెందిన కానిస్టేబుల్ రాంబాబు కుటుంబానికి మరియు కానిస్టేబుల్ జైపాల్ రెడ్డి కుటుంబానికి 1.50 లక్షల చొప్పున చొప్పున 3,00000 లక్షల రూపాయలు ఎస్పి కె. నరసింహ ఐ.పి.ఎస్ గారి చేతులు మీదుగా ఇవ్వడం జరిగింది. ఇందులో సూర్యాపేట జిల్లా పోలీసుసంఘం అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ చంద్రా గౌడ్ గారు మరియు ఎస్ బి ఇన్స్పెక్టర్ రామారావు సార్, 20212 బ్యాచ్ పోలీస్ లు సతీశ్, అశోక్, ప్రవీణ్, అబిద్, అంజి, వెంకట్, నాగయ్య, అందె శ్రీను అందు బాటులో ఉన్న సిబ్బంది మొదలగు వారు హాజరుఅయినారు