వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమలు చేస్తాం
జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురుపంగ ప్రకాష వనం ఉపేందర్
భువనగిరి 22 జూన్ 2024 తెలంగాణావార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక భువనగిరి డివిజన్ మహాసభ స్థానిక రిటైర్ ఉద్యోగుల సంఘం భవనంలో కేతావత్ మురళి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురుపంగా ప్రకాష్ వనం ఉపేందర్ మాట్లాడుతూ..2011జనాభా లెక్కల ప్రకారం దేశంలో 2.21శాతం మంది వికలాంగులు ఉన్నారని, ఘనంకలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సామాజిక ఘనంకాల విభాగం విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 19 శాతం మంది చూపు, వినికిడి లోపం కలిగి ఉన్నారని, 8శాతం మంది బహుళ వైకాల్యం కలిగి ఉన్నారని అన్నారు.76శాతం మంది గ్రామీణ ప్రాంతంలో,24శాతం మంది పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ మరియు ప్రభుత్వయేతార సౌకర్యాలు వికలాంగులకు అందడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది వికలాంగులు ఉంటే పెన్షన్స్ కేవలం 5.75లక్షల మందికే వస్తున్నాయని అన్నారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను ప్రకటించి, ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.శరీరక వికలాంగుల రోస్టర్ 10లోపు తగ్గిస్తూ స్టేట్ సభర్డినేట్ సర్వీస్ రూల్స్ సవరించాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6వేలు పెన్షన్ వెంటనే అమలు చేయాలని అన్నారు.నిరుద్యోగ వికలాంగులకు.వికలాంగులపై జరుగుతున్న వేధింపులు అరికట్టెందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవలని అన్నారు. తీవ్ర వైకాల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని నిర్ణయం చేసిన ఎందుకు అమలు చేయడం.సామూహిక ప్రాంతాలన్నీ అవరోధ రహితంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసి 4 ఏండ్లు గడుస్తున్న ఇంతవరకు ఏర్పాటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు .
ఈ మహాసభను ఉద్దేశించి ఎన్ పి ఆర్ డి జిల్లా గౌరవ అధ్యక్షులు మాటూరి బాలరాజు మాట్లాడుతూ వికలాంగుల హక్కుల సాధన కోసం నిత్యం పోరాడుతున్న సంఘం ఎన్ పి ఆర్ డి వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం సంఘమిత్ర పిలుపు వికలాంగులు అంత తరలిరావాలని వారు ఈ సందర్భంగా వికలాంగులు కోరారు. డిఆర్డిఏ యాదాద్రి భువనగిరి జిల్లా ఏపీవో శ్రీనివాస్ మాట్లాడుతూ..ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వికలాంగులు చేరువ చేయడానికి ధనవంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా వికలాంగులకు హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బొల్లేపల్లి స్వామి జిల్లా మహిళా కన్వీనర్ కొత్త లలిత మహిళా నాయకురాలు కొండాపురం మనోహర జిల్లా ఉపాధ్యక్షులు పాక వెంకటేష్ జంగయ్య అనసూయ గడ్డం యాదగిరి సుదర్శన్ సునీల్ రత్నపురం యాదగిరి అంజన్ శ్రీ గోపి రమణ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.