విద్యారంగ సేవకుడు సత్తార్ సార్

సూర్యాపేట:- విద్యా రంగానికి ఎనలేని సేవలు చేసి ఎందరో విద్యార్థులను తన శిష్యులుగా ఉన్నత స్థానంలో నిలిపిన ఎస్ ఏ సత్తార్ గొప్ప విద్యావేత్త అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమానికి గో పగాని వెంకటనారాయణ అధ్యక్షత వహించగా, బాపూజీ విద్యార్థుల కమిటీ కన్వీనర్ డేగల జనార్ధన్ ప్రధాన వక్త గా హాజరయ్యా రు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యా రంగంలో ఎందరో వ్యాపారం చేసి కోట్లు గడిచారని, సత్తార్ సార్ మాత్రం విద్యారంగంలో సేవ మాత్రమే చేశారని అన్నారు.
సూర్యాపేట లో బాపూజీ ట్యుటోరియల్ కాలేజీ నీ ఏర్పాటు చేసి దాదాపు 10 ఏళ్ళు డైరెక్ట్ టెన్త్, ఇంటర్ వంటి విద్య ను ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలిపిన చరిత్ర ఆయన సొంతమని అన్నారు. అంతే కాదు గ్రామీణ విద్యార్దులకు ఆశా కిరణం గా నిలిచి విద్యార్థుల ఆరాధ్యుడు గా వున్నారని అన్నారు. కార్యక్రమ అధ్యక్షులు గోప గానీ వెంకట నారాయణ మాట్లాడుతూ సత్తార్ సార్ అందరి కుటుంబాలకు దారి చూపారని, ఆయన విద్యారంగ సేవకుడు మాత్రమేనని, ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, ఇతర ప్రముఖులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.