విత్తనపత్తి రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలి
- విత్తనపత్తి ప్యాకెట్ పై రేట్లు పెంచి,ఫెయిల్ అయిన విత్తనాలను రీ శాంపిల్ పెట్టాలి..
- నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మోకాళ్ళపై నిరసన చేపట్టిన రైతులు...
- విత్తన పత్తి రైతులకు న్యాయం చేయాలి...
- NHPS జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్...
జోగులాంబ గద్వాల 31 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల: జిల్లాలో సీడ్ పత్తి రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని విత్తన పత్తి ప్యాకెట్ పై రేట్లు పెంచి ఫెయిల్ అయిన విత్తనాలను రీ శాంపిల్ పెట్టాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి మోకాల నిరసన చేపట్టగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పలు డిమాండ్లతో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ వినతి పత్రం సమర్పించి జిల్లాలో జరుగుతున్న మోసాలపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ ను కోరారు.
ఈ సందర్భంగా గొంగళ్ళ రంజిత్ కుమార్ మాట్లాడుతూ...
జిల్లాలో అత్యధికంగా సాగు చేస్తున్న సీడ్ పత్తి రైతులు సీడ్ కంపెనీలు మరియు ఆర్గనైజర్ల ద్వారా అనేక రకాలుగా మోసపోతున్నారని, విత్తన పత్తి ప్యాకెట్ పై రేట్లు పెంచకుండా రైతులను నిండా ముంచుతున్నారని, ఆర్గనైజర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.
కంపెనీలు ఇచ్చే వాస్తవ ప్రయోజనాలను రైతులకు అందించకుండా మధ్యవర్తులుగా ఉన్న ఆర్గనైజర్లు దోపిడీ చేయడమే కాక, రైతులకు అడ్వాన్సు పరంగా ఇచ్చే పెట్టుబడిని బాకీల ప్రకారం లెక్క కట్టి వడ్డీలు వసూలు చేయడంతో పాటు రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని తెలిపారు.
విత్తన పత్తి ప్యాకెట్ పై రేట్లు పెంచడంలో, కంపెనీ మరియు ఆర్గనైజర్ల ద్వారా జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. సకాలంలో రైతులకు మార్కెట్ రేట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి ఇంకా న్యాయం జరకకపోతే త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న ఆర్గనైజర్ల దోపిడీని అరికట్టే విధంగా కలెక్టర్ చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరగా దానికి సానుకూలంగా స్పందించి, సమావేశం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా నాయకులు రంగస్వామి,వెంకట్రాములు,జమ్మన్న, గద్వాల,గట్టు,ధరూర్, మల్ధకల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, బలరాం నాయుడు, నెట్టెంపాడు గోవిందు, విష్ణు, అలంపూరు నియోజకవర్గ కన్వీనర్ నాగేష్ యాదవ్,వీరేష్, వీరితో పాటు ఆయా మండలాల ఉపాధ్యక్షులు నజుముల్లా,ప్రేమ్ రాజ్, దయాకర్,ఆంజనేయులు మునెప్ప, మండల కార్యదర్శులు కృష్ణ,రాము, నాయకులు చిన్న రాముడు,ఆశన్న జమ్మన్న, కార్తీక్ నాగరాజు మరియు ఆయా గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.