పెట్రోల్ ట్యాంకర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

Apr 11, 2024 - 20:12
 0  77

కాలువ పై ఉన్న కల్వర్టు విరిగి ఇరుక్కుపోయిన పెట్రోల్ ట్యాంకర్

జోగులాంబ గద్వాల 11 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- పెట్రోల్ ట్యాంకర్ కు తృటిలో తప్పిన ప్రమాదం. కాలువ పై ఉన్న కల్వర్టు విరిగి ఇరుక్కుపోయిన పెట్రోల్ ట్యాంకర్.  వివరాలకు వెళితే.. హైదరాబాదు నుంచి గద్వాలకు ఆర్టీసీ పెట్రోల్ బంకు వస్తున్న  12 వేల లీటర్ల లోడుతో వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ గద్వాల్ చేరుకోగానే పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ కు దారి తెలియక పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న ఇరుకు రోడ్ లో రాజీవ్ మార్గ్ నుంచి ఎస్సీ హాస్టల్ రూట్ లో  రావడం జరిగింది.  100 మీటర్ల దూరంలో ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో ఒక కాల్వపై వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ బరువుకి కల్వర్టు విరిగి పెట్రోల్ ట్యాంకర్ అందులో ఇరుకపోవడం జరిగింది.  డ్రైవర్ గమనించకపోవడంతో పెట్రోల్ ట్యాంకర్ కు పెద్ద ప్రమాదం తప్పింది.  కల్వర్టు లో  ఇరుక్కుపోయిన పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడి ఉంటే పక్కనే పెట్రోల్ బంకు ఉండడంతో పెద్ద ప్రమాదం జరిగేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.  డ్రైవర్ అప్రమత్తం  కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. కల్వర్టులో ఇరుక్కుపోయిన పెట్రోల్ ట్యాంకర్ ని క్రేన్ సహాయంతో సురక్షితంగా బయటికి తీశారు. మున్సిపల్ చైర్మన్ మరియు అధికారులు ఈ కల్వర్టును సరిచేసి అక్కడ స్పీడ్ బ్రేకర్ వేసి భారీ వాహనాలకు దారి లేదని బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333