శ్రీకృష్ణ స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం

జోగులాంబ గద్వాల జిల్లా31 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: మల్దకల్. నేడు స్వయంభు శ్రీ క్రిష్ణ స్వామి దేవస్థానందు శనివారం సందర్భంగా దేవాలయ సన్నిధానంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు అవుతారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థాన ఈవో పురేందర్ ఆధ్వర్యంలో అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని భావించి భక్తుల సహకారంతో ప్రతి శనివారం మరియు అమావాస్య రోజు భక్తులకు అన్నదానకార్యక్రమం ఏర్పాటు చేయించారు. అన్నదాత: ఎలుక రామకృష్ణ ( రాజు) తండ్రి ఎలుక గోవిందు సద్ద లోని పల్లి గ్రామ నివాసి స్వామివారికి ఇచ్చిన ముక్కు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో: శ్రీకృష్ణ స్వామి పూజ అర్చకులు : పూజారి కృష్ణయ్య మరియు పూజారి పాండురంగ స్వామి, అన్నదాన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.