విద్యార్థులు వ్యసనాలకు అలవాటు పడవద్దు.
- మంచి భవిష్యత్తు కోసం లక్ష్యం పెట్టుకొని కష్టపడాలి.
సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే.
సూర్యాపేట:- విద్యార్థులు వ్యసనాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని మంచి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బంగారు భవిష్యత్తు కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హేగ్డే అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మేళ్ళచెరువు పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్సై, సిబ్బంది రేవూరు రోడ్డు నందు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక విద్యార్థి వద్ద కొంత గంజాయి లభించినదని, అతని సమాచారం మేరకు నిఘా ఉంచి జగ్గయ్యపేటకు చెందిన బొజ్జగాని రోహిత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకోవడం జరిగినదని, అతని వద్ద 120 గ్రాముల గంజాయి గుర్తించి సీజ్ చేశాము అని ఎస్పి తెలిపారు. విద్యార్థి పై, సరఫరా చేసే వ్యక్తి పై ఇరువురిపై ఎన్ డి పి ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. జిల్లాలో గంజాయి వినియోగించే వారి, అమ్మే వారి, సరఫరా చేసే వారి పూర్తి సమాచారం ఉన్నదన్నారు.అందరిపై నిఘా ఉంచామని, గంజాయి సఫరా, అమ్మకం, త్రాగటం నేరం ఆని, ఈ రకమైన నేరానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి వల్ల యువత భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు. గ్రామీణ యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, చిన్న చిన్న ప్యాకెట్ లలో గ్రామాలకు గంజాయి తెచ్చి యువతకు, విద్యార్థులకు అలవాటు చేసి తర్వాత అధిక ధరలకు విక్రయిస్తారని, ఇలాంటి వారి మాయలో పడి గంజాయి మత్తుకు బానిసలు కావద్దని కోరారు. తల్లిదంద్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల, పిల్లల అలవాట్లను గమనించాలని,వారు తప్పుదోవ పట్టకుండా చూడాలని, గంజాయి నిర్మూలనలో పోలీసు వారితో సహకరించి సమాచారం అందించి, పిల్లల భవిష్యత్తును కాపాడాలని అని ఎస్పి విజ్ఞప్తి చేశారు. గంజాయి పట్టుబడి చేయడంలో బాగా పని చేసిన ఎస్సై, సిబ్బందిని ఎస్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ రాము, మెల్లచేరువు ఎస్సై పరమేష్ ఉన్నారు.