కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గౌడలకి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండల మల్లేష్

Feb 21, 2026 - 21:38
Feb 21, 2026 - 21:39
 0  18
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గౌడలకి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి

అడ్డగూడూరు 21 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:–    కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గౌడలకి ఇచ్చిన హామీ ప్రకారం మేనిఫెస్టోను వెంటనే అమలు చేయాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్ గౌడ్ డిమాండ్ చేశారు. అడ్డగూడూరు మండలంలోని చౌళ్ళ రామారం గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం గౌడలకు గుర్తింపు కార్డులు మరియు గౌడ కార్పొరేషన్ ఏర్పాటు మరియు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అనుమతిచ్చి కల్లు గీత వృత్తిదారుల పొట్ట ట్టగొడుతున్నది. వచ్చే బడ్జెట్ సమావేశంలో రెండు వృత్తి దారులకు బడ్జెట్ కేటాయించి గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ఎక్స్ గ్రేషియలు వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో చలో అసెంబ్లీ ముట్టడి చేస్తామని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరుపున హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు అనంతల దేవాంజి గౌడ్,చిత్తలూరు సుధాకర్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు