ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిన కొప్పుల వేణారెడ్డి

Apr 8, 2025 - 19:55
Apr 8, 2025 - 19:54
 0  11
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిన కొప్పుల వేణారెడ్డి

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిన కొప్పుల వేణారెడ్డి గారు

సూర్యాపేట పట్టణంలోని *రాయిని గూడెం(11వ వార్డు) లో PACS ఆధ్వర్యంలో* ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *కొప్పుల వేణారెడ్డి* గారు

ఈ సందర్భంగా వారు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐకెపి లను ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.

తేమయంత్రాలు, ప్యాడి క్లీనర్లు, కాంటాలు, టార్పాలిన్లు, గన్ని బ్యాగులు కొరత లేకుండా చూడాలి అని సెంటర్ నిర్వాహకులకు ఆదేశించారు.

ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం తక్కువగా ఉండేవిధంగా తూర్పారబెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. 

నాణ్యతా ప్రమాణాలు పాటించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. 

గ్రేడ్‌-ఏ ధాన్యానికి రూ. 2320, సాధారణ రకం ధాన్యానికి రూ.2300 మద్దతు ధర పొందాలన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. 

రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలకే విక్రయించాలన్నారు.

రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న వరి కోతల వివరాల ఆధారంగా రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. 

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్, AO, అగ్రికల్చర్ అధికారులు, 11 వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్గురి వెంకటేశం గౌడ్, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, నంద్యాల ప్రతాప్ రెడ్డి, తంగేళ్ళ రవికాంత్ రెడ్డి, కొప్పుల రాంరెడ్డి, గుర్రం వెంకట్ రెడ్డి, ఎల్గురి వీరయ్య గౌడ్, యాలగబోయిన మధు యాదవ్, జంగిలి సైదులు, ఏండ్ల ఉపేందర్,మేకలబోయిన శేఖర్,మందాడి రాంరెడ్డి, నారాయణ వీరారెడ్డి, గోపిరెడ్డి దామోదర్ రెడ్డి, గోపిరెడ్డి ఉపేందర్ రెడ్డి, మాలి నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333