వికలాంగులకు గ్రామపంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్ స్థానం కల్పించాలి
కామారెడ్డి 06 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్లమెంటు ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీ మేరకు రాజస్థాన్,చతిస్గడ్,తరహాలోనే తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు గురువారం కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలో సంఘం మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 2024 అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 8 ఐటెం నెంబర్ 8లో తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని వికలాంగులకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్,చతిస్గడ్, రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లోనూ వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి పార్లమెంటు ఎన్నికల్లో వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని ఏడాది పూర్తి అయిన వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు ధోరణితో చూడటం కాంగ్రెస్ పార్టీకి మంచి సంప్రదాయం కాదని తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉన్న వికలాంగుల సామాజిక వర్గం ఓట్లను కొల్లగొట్టేందుకు తెలంగాణలో తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6000 పెంచుతామని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 సంవత్సరంవంతంగా అమలు చేస్తామని నాడు పిసిసి అధ్యక్షుని హోదాలో అనేక హామీలు ఇచ్చి వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు మీనమేషాలు లెక్కించడంతోపాటు వికలాంగుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్న తీరు తెలంగాణ వికలాంగుల సమాజం గమనిస్తుందని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలని పార్లమెంటు ఎన్నికల సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన హామీ మేరకు రాజస్థాన్,ఛతీస్ఘడ్ రాష్ట్రాల తరహాలో వెంటనే తెలంగాణలోని వికలాంగులకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని లేకుంటే వికలాంగుల సమాజాన్ని ఎన్నికల సమయంలో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసేలా తమ ఉద్యమ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.సంఘం బీర్కూర్ మండలం నూతన అధ్యక్షుడు షేక్ ముఖీం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు జాదవ్ పండరి జిల్లా ఉపాధ్యక్షుడు లకావత్ మోహన్,మహిళా నాయకురాలు కవిత,ఓండ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.