గురుకులలలో మౌళిక సదుపాయాలు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం

Jul 11, 2025 - 19:17
 0  28

BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

గురుకులలపై నిర్లక్ష్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.

కేటీ దొడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకులంలో బాత్ రూమ్స్ లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు.

జోగులాంబ గద్వాల 11 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ధరూర్ మండలం మార్లబీడు దగ్గర ఉన్న కేటీ దొడ్డి మండల మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలను విజిట్ చేసి విద్యార్థులను అడిగి పలు సమస్యలు తెలుసుకున్నారు.


ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ... విద్యార్థులకు బాత్రూమ్స్ టాయిలెట్స్ లేక చాలా ఇబ్బందిగా గురవుతూ అర్ధరాత్రి పూట కూడా కాంపౌండ్ దాటి బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొంది అని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని అన్నారు.  అదేవిధంగా లోపల డైనింగ్ హాల్ లేకపోవడం వల్ల భోజనం చేసేటప్పుడు నిలబడి చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు.  ఇంటర్మీడియట్ విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ పరంగా సామాజిక అంశాలను బోధించాల్సినటువంటి పరిస్థితి ఉంది జనరల్ నాలెడ్జ్ పరంగా విద్యార్థులు చాలా వీక్ గా ఉన్నారని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయితే కూడా గురుకుల లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడం రేవంత్ రెడ్డి సర్కార్ కు సిగ్గుచేటు అన్నారు.

విద్యార్థులకు రెండు లక్షల హామీ మోసం.

విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఇవ్వకుండా మోసం.

యువ వికాసం కింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు మోసం.

మహిళా విద్యార్థులకు స్కూటీల హామీ మోసం.

6 గ్యారంటీ లకు సున్నం.. 420 హామీలకు పంగ నామాలు పెట్టినా దుర్మార్గమైన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్.

ప్రజా పాలనా అని ప్రజల నెత్తిమీద ఉరితాలు బిగిస్తున్న దుర్మార్గమైన ప్రభుత్వం అని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చవరకు వదిలిపెట్టం అని డిమాండ్ చేశారు. 

ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి మందుకు డ్రగ్స్ అలవాటు పడకూడదు అని, వాటికి అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని అన్నారు.

 జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని చదివితే మనం భవిష్యత్తులో మనం అనుకున్న గోలు చేరుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమం లో మహాదేవ్, యువరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333