జర్నలిస్ట్ నుంచి అడ్వకేట్ స్థాయికి ఎదిగిన అల్లె రాము
కోరుట్ల బార్ అసోసియేషన్ లో సభ్యత్వం పొందిన అడ్వకేట్ అల్లె రాము
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన అల్లె మల్లయ్య - సుగుణ దంపతుల మూడో కుమారుడు అల్లె రాము జర్నలిస్ట్ నుంచి అడ్వకేట్ స్థాయికి అంచెలంచెలుగా ఎదిగారు. మొదటగా ఈనాడు దినపత్రిక లో, ఆ తర్వాత V6 వెలుగు దినపత్రికలో దాదాపు 16 సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్ట్ గా, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీ.యూ.డబ్ల్యూ.జె.) (ఐ.జె.యూ అనుబంధం) జగిత్యాల జిల్లా సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. అలాగే ఎంతో కష్టపడి వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని హన్మకొండ ఆదర్శ లా కాలేజీ లో న్యాయ శాస్త్రం అభ్యసించి 2022లో లా పట్టా పొందారు. 2023లో తెలంగాణ హై కోర్టు లోని బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో అడ్వకేట్ గా ఎన్రోల్మెంట్ కాబడినారు. ఇటివల 2025 ఫిబ్రవరి 3వ తేదీ వసంత పంచమి శుభదినంన జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టులో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తన్నీరు శ్రీనివాసరావు, సెక్రటరీ సుతారి శ్రీనివాస్, ట్రెజరర్ చిలువేరి రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ తోట ఆంజనేయులు, ఏజీపీ గొనె రాజేష్ ఖన్నా , సీనియర్ అడ్వకేట్ కడకుంట్ల సదాశివరాజు, కొంపెల్లి సురేష్ , సంగ విజయ్ సాయి, అనాస్, అరుణ్, ప్రేమ్, ఉమా, దీప తదితరుల అడ్వకేట్ల సమక్షంలో సభ్యత్వం పొందారు. కోరుట్ల బార్ అసోసియేషన్ లో సభ్యత్వం పొంది కోరుట్ల కోర్టులో జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఈ సందర్భంగా కోణార్క్ సెల్ పాయింట్ అధినేత మార్త శివకుమార్, తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు టైగర్ అలీ నవాబ్ ఆధ్వర్యంలో అడ్వకేట్ అల్లె రాము ను శాలువాతో సన్మానించి, స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.