లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులకు ఆహ్వానం    ఇదొక సువర్ణ అవకాశం 

May 12, 2025 - 19:44
 0  17
లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులకు ఆహ్వానం    ఇదొక సువర్ణ అవకాశం 

జోగులాంబ గద్వాల 12 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) నుండి లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్  సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో తెలియజేశారు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్ధులు  తెలంగాణలోని అన్ని మీ సేవ కేంద్రాలలో లైసెన్స్ సర్వే శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేయవచ్చని, ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో మొత్తం 50 పని దినాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.   అభ్యర్థుల ఇంటర్మీడియట్ (గణిత శాస్త్రం ఒక అంశంగా ఉండాలి) కనీసం 60% మార్కులతో ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్), డిప్లొమా (సివిల్), బి.టెక్ (సివిల్) లేదా ఇతర సమానమైన అర్హత కలిగి ఉండాలన్నారు.దరఖాస్తు విధానం దరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్ను 2025 మే 5 నుండి మే 17 వరకు మీ సేవా కేంద్రాల ద్వారా మాత్రమే రూ. 100/- చెల్లించి పొందవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 17.05.2025 (మీ సేవ కేంద్రాల్లో మాత్రమే) 

అర్హులైన అభ్యర్థులు ఓ.సి.అభ్యర్ధులకు రూ.10,000/-
బి.సి.అభ్యర్ధులకు రూ.5,000/-
ఎస్. సి./ ఎస్.టి.అభ్యర్థులకు రూ.2,500/- ఫీజు పురుషము చెల్లించాల్సి ఉంటుందన్నారు.
లైసెన్స్ కలిగిన సర్వేయర్లుగా మారేందుకు ఇదొక సువర్ణ అవకాశమని, అర్హత కలిగినటువంటి అభ్యర్థులు, తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మానేజ్మెంట్ నుండి విడుదల అయినటువంటి ఈ నోటిఫికేషన్ ని సద్వినియోగ పరుచుకోవాలని కలెక్టర్ సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333