గుప్త నిధుల కొరకు అక్రమ తవ్వకాల కోసం ప్రయత్నం  – 08 మంది అరెస్ట్ 

Sep 11, 2026 - 10:17
 0  0
గుప్త నిధుల కొరకు అక్రమ తవ్వకాల కోసం ప్రయత్నం  – 08 మంది అరెస్ట్ 

చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి  పురాతన ఆలయాల పరిసర ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు చేస్తున్న 10 మందిని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చివ్వెంల పోలీస్ వారు వెళ్ళి 06.09.2026 తెల్లవారుజామున సుమారు 04:00 గంటలకు కేషరాజు కుంట కట్ట వద్ద అనుమానాస్పదంగా తవ్వకాలు చేస్తున్న వ్యక్తులను గుర్తించారు. వారి వద్ద నుంచి గుప్త నిధుల కోసం వాడుతున్న మెటల్ డిటెక్టర్, స్కానర్, లొకేటర్ తదితర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ఛైర్మన్ చకిలం కృష్ణ కుమార్గారి ఫిర్యాదు మేరకు  చివ్వెంల SI V. మహేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి,  దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సూర్యాపేట రూరల్ CI G. రాజశేఖర్ గారి ఆద్వర్యంలో చివ్వెంల SI V. మహేశ్వర్ 08 మంది నిందితులను అదుపులోకి తీసుకుని ఈ రోజు అరెస్ట్ చేయటం జరిగినది 
నిందితుల వివరాలు  
పచ్చిపాల మధు, యల్లాల శ్రీకాంత్, భూతరాజు శివ, నకిరేకంటి గోపి, చర్లపల్లి ప్రణయ్ కుమార్, రాపాని తిరుపయ్య, కడారి సైదులు, భూక్యా తులశ్య 
స్వాదీన పరుచుకున్న వివరాలు 
1.    మెటల్ డిటెక్టర్,
2.     స్కానర్, 
3.    లొకేటర్
4.    6 సెల్ ఫోన్ లు ఒక టాబ్ 
5.    ఒక డ్యూయట్ స్కూటీ -  
ప్రజలు గుప్త నిధుల పేరుతో జరిగే మోసాలను నమ్మవద్దని, ఇలాంటి కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333