ఎన్ఎస్‌యూఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కొండగడుపుల ప్రవీణ్ కుమార్

Sep 10, 2026 - 22:24
 0  0
ఎన్ఎస్‌యూఐ సూర్యాపేట జిల్లా  అధ్యక్షుడిగా కొండగడుపుల ప్రవీణ్ కుమార్

తిరుమలగిరి 11 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిగా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన కొండగడుపుల ప్రవీణ్ కుమార్ ను నియమించారు. ఎన్ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్‌ జకర్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ స్వామి ఈ నియామకం చేపట్టారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ప్రవీణ్ కుమార్ గురువారం సాయంత్రం అందుకున్నారు.

ఈ సందర్భంగా కొండగడుపుల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎల్లవేళలా విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల హక్కులు, సమస్యలపై పోరాడుతూ వారికి అండగా నిలుస్తానన్నారు. పార్టీ నాయకుల సహకారంతో కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా జిల్లా ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిగా అవకాశం కల్పించేందుకు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీరా రెడ్డి , భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రితం, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ రెడ్డి, సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వెణారెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధకిషన్ రావు ,ఎన్ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షులు వినోద్ జాఖర్,ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు యాడవెల్లి వెంకటస్వామిలకు కృతజ్ఞతలు తెలిపారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి