తెలంగాణ ఉద్యమకారులపై రౌడీషీట్ తొలగించాలి
2011 నాటి రౌడీ షీట్ తొలగించాలి – జిల్లా కలెక్టర్‌కు ఉద్యమకారుడి వినతి
తిరుమలగిరి 11 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మలిదశ ఉద్యమకారులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో 2011లో నమోదు చేసిన రౌడీ షీట్‌ను తొలగించాలని కోరుతూ, నాటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఆధారాలను సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులు, రౌడీ షీట్లను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి తొలగించాలని కోరారు..