రోడ్డు ఆక్సిడెంట్ లో మరణించిన పోలీసు అధికారి కుటుంబానికి విడో కార్పస్ ఫండ్
చెక్ ను అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్

జోగులాంబ గద్వాల 1 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల రోడ్డు ఆక్సిడెంట్ కారణంగా మరణించిన పోలీస్ అధికారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు, ఐపీఎస్., విడో కార్పస్ ఫండ్ చెక్ ను అందజేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయం లో గల పోలీస్ కంట్రోల్ రూమ్ విభాగంలో ఎ.ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఎమ్. ఎ. సమీద్ 18.05.2025 న జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి భార్య సజిదా సుల్తానా మరియు వారి కుమారుడికి ఈ రోజు జిల్లా ఎస్పీ విడో కార్పస్ ఫండ్ క్రింద 1,00,000/- రూపాయాల చెక్ ను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ....వారి కుటుంబ స్థితి గతులను, వారి పిల్లల విద్యా అభ్యసన వివరాలను తెలుసుకోవడం జరిగింది . విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలకు అన్ని వేళలా అండగా ఉంటూ, వారి సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు.
వీరి కుటుంబానికి రావాల్సిన మిగిలిన బెనిఫిట్స్ అన్ని కూడా త్వరగా వచ్చేందుకు కృషి చేయాలని కార్యాలయ ఏ.ఓ. ని ఆదేశించారు.
ఈ కార్యక్రమములో కార్యాలయ ఏ.ఓ. బి.సతీష్ , సూపరింటెండెంట్ నాగమణి, ఎమ్. ఎ. సమీద్ భార్య సజిదా సుల్తాన్ మరియు కుమారుడి పాల్గొన్నారు.