కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- .జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమానికి స్థానిక గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా కేటీ దొడ్డి మండలాలకు చెందిన 204 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. ముఖ్యంగా వ్యవసాయాన్ని పండుగ చేయ డానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగా రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, పంటల బీమా పథకాలతో రైతన్నలను ఆదుకుంటుందన్నారు.రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.తన నియోజకవర్గంలో ఎవరు కూడా, ఎక్కడ కూడా అధైర్యపడవద్దు అని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తానన్నారు. ఇల్లు లేని వారికి ఇళ్లను కట్టిస్తానని, కొత్త రేషన్ కార్డులను త్వరలోనే మంజూరు చేయిస్తానని అన్నారు. అంతేకాకుండా స్థానిక ఎన్నికలు రానున్నాయని, ఎలక్షన్లు రాగానే ఓట్ల బిచ్చగాళ్లు వస్తుంటారని, ప్రజలు జాగ్రత్తగా గమనించాలని, మంచి నాయకులను ఎన్నుకోవాలని, పనిచేసే నాయకులకు పట్టం కట్టాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, రమేష్ నాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు , మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, కౌన్సిలర్ దౌలు, సింగిల్ విండో డైరెక్టర్ రఘ కుమార్ శెట్టి, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.