రెవెన్యూ సదస్సులో పాల్గొన్న..
డిప్యూటీ తహశీల్దార్ అలవేలు మంగమ్మ

జోగులాంబ గద్వాల 3 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ధరూర్ మండల పరిధిలో ఉన్న నీలహళ్లి గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన రెవెన్యూ చట్టం "భూభారతి" అమల్లో భాగంగా రెవెన్యూ సదస్సు నిర్వహించామని డిప్యూటీ తాహశీల్దార్ అలవేలు మంగమ్మ తెలిపారు. ధరణికి బదులుగా భూభారతి అందుబాటులోకి వచ్చిందని ఈ సదస్సులో రైతులకు భూ సమస్యల గురించి అవగాహన కల్పించమన్నారు. భూ సమస్యలపై రైతుల నుంచి పలు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది అన్నారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, రైతు సంఘాల నాయకులు,రైతులు, యువత తదితరులు పాల్గొన్నారు.