Rain Alert.. ఐఎండి రెయిన్ అలర్ట్..ఈ 17 రాష్ట్రాలకు హెచ్చరిక..

Aug 14, 2024 - 20:29
 0  3
Rain Alert.. ఐఎండి రెయిన్ అలర్ట్..ఈ 17 రాష్ట్రాలకు హెచ్చరిక..

ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా గస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉన్న క్రమంలో వర్షాలు(rains) విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా 17 రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచనలు జారీ చేసింది.ఉన్న క్రమంలో వర్షాలు(rains) విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా 17 రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచనలు జారీ చేసింది.

ఇప్పటికే ఢిల్లీ చుట్టుపక్కల నగరాల్లో నిన్న జోరు వాన కురిసింది. ఈ క్రమంలో ఢిల్లీలో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

పలు రాష్ట్రాల్లో

ఇక ఆగస్టు 15న కర్ణాటక, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జార్ఖండ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్ము, హర్యానా, ఛత్తీస్‌గఢ్ , ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్‌లతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే వర్షపు నీటిలో మునిగి ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందారు. 

ఆరెంజ్ అలర్ట్

అంతేకాకుండా, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లలో కూడా పగటిపూట భారీ వర్షాలు కురుస్తాయని IMD ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాయువ్య భారతదేశంలోని మైదానాలలో చాలా విస్తృతమైన వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 18 వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది హర్యానాలో ఆగస్టు 16 వరకు, జమ్మూ కశ్మీర్‌లో రాబోయే మూడు రోజులు, పంజాబ్‌లో ఆగస్టు 14న వర్షాలు కురియనున్నట్లు వెదర్ రిపోర్ట్ తెలిపింది.

అప్రమత్తంగా ఉండాలి

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో గంగా, యమునా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో 30కి పైగా జిల్లాలు వరదల్లో మునిగిపోయాయి. గంగానది ఘాట్‌లు కూడా నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాజస్థాన్‌లో వర్షాల కారణంగా 3 రోజుల్లోనే 25 మందికి పైగా మరణించారు. ఇంకోవైపు కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్‌లో 200కు పైగా రోడ్లు మూసుకుపోయాయి. జులై 27 నుంచి ఆగస్టు 12 వరకు హిమాచల్‌లో రూ. 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతోపాటు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333