రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా అందరికీ వర్తింప చేయాలి...... నాదెండ్ల గోపాలరావు
మునగాల 16 జూలై 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
మునగాల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నాదెండ్ల గోపాలరావు ఒక సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలోని రైతులందరికీ రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఎలాంటి షరతులు లేకుండా అందరికీ వర్తింపజేయాలి అదేవిధంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు లాంటి ప్రధానమంత్రి కిసాన్ యోజన లాంటి నిబంధనలను పెట్టి కొంతమందికి రుణమాఫీ చేయకుండా తప్పించుకోవడం సరైన విధానం కాదు ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీకి విరుద్ధంగా ఉంది అలా నియమాలు పెడితే గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఏమీ ఉండదు వారికి పట్టినగతే మీకు పడుతుంది కావున ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారుతుందో లేఖ రైతు పక్షపాతి ప్రభుత్వం గా ఉంటుందో నిర్ణయించుకునే దిశగా పాలకులు ఆలోచన చేయాలి అదేవిధంగా రైతు భరోసాని కూడా వీలైనంత త్వరగా రైతులందరికీ అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చవి చూడవలసి ఉంటుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నిటిని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల గ్రామ నాయకులు పాల్గొనడం జరిగింది.