ఇందిరమ్మ ఇళ్లలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ఇందిరమ్మ ఇళ్లలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి . ఆత్మకూరు ఎస్ జిల్లాతో పాటు మండలంలోని దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ప్రకారం ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలనీ వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి జహీర్ బాబా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తహాసిల్దార్ జి హరిచంద్రప్రసాద్ కి ఎంపీడీవో కార్యాలయ సూపర్ ఇండెంట్ వెంకటచారి కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగులకు ఇందిరమ్మ ఇళ్ల గురించి జరిగిన గ్రామసభలలో ఏ ఒక్క గ్రామంలోనైనా దివ్యాంగులకు ఇందిరమ్మ ఇల్లు రిజర్వేషన్ ప్రకారం కేటాయించలేదు. జీవో నెంబర్ 25 ప్రకారం ఇందిరమ్మ ఇళ్లలో ప్రతి గ్రామంలో ఐదు శాతం రిజర్వేషన్ ప్రకారం ఇల్లు కేటాయించాలి. ఇదే విషయమై సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం జరిగిందనీ అన్నారు. దివ్యాంగులకు మండలానికి ఒకటే లోన్ ఇవ్వడం చాలా దారుణం అన్నారు . మండలానికి కనీసం ఐదు లోన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు కొప్పుల కళింగ రెడ్డి ,వీహెచ్పీఎస్ మండల ఇన్చార్జ్ బండి మల్లయ్య, పాండవుల లింగయ్య,బత్తుల జంపయ్య, బచ్చలకూరి లింగయ్య ,గండమల్ల దయాకర్, దొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.