రానున్న ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి మండలంలో మళ్ళీ ఎర్రజెండా ఎగురవేయాలి
సీపీఐ శ్రేణులకు జాతీయ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి.
100 సంవత్సరాల మహోజ్వల పోరాటాల,త్యాగాల చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ సీపీఐ.
రానున్న ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి మండలంలో మళ్ళీ ఎర్రజెండా ఎగురవేయాలి.
సీపీఐ శ్రేణులకు జాతీయ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి.
చిగురుమామిడి 21 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- భారతదేశ గడ్డపై వందేళ్ల మహోజ్వల పోరాటాల,త్యాగాల చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ అని అలాంటి పార్టీకి చిగురుమామిడి మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి తిరిగి మండలంలో ఎర్రజెండా ఎగురవేసేందుకు సీపీఐ శ్రేణులు సంసిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)100 సంవత్సరాల ఉత్సవాలలో భాగంగా మండల కేంద్రంలో రెడ్ షర్ట్ వాలంటీర్లు 100 ఎర్ర జెండాలు చేతబూని సర్వాయి పాపన్న విగ్రహం నుండి బస్టాండ్ మీదుగా మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీకి అగ్రభాగాన చాడ వెంకటరెడ్డి, మర్రి వెంకటస్వామితో పాటు జిల్లా,మండల నాయకత్వం నిలిచారు.
ర్యాలీ అనంతరం మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో వందేళ్ళ ఉత్సవాల బహిరంగ సభ సిపిఐ మండల కార్యదర్శి నాగిని లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని పోరాటాలు జరుగుతున్న క్రమంలో 1925 డిసెంబర్ 26న ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో సిపిఐ ఆవిర్భవించిందని, దేశంలో దోపిడీ లేని,అంతరాలు లేని సమ సమాజ స్థాపన కోసం పెట్టుబడి దారి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక,కర్షక,ప్రజా దోపిడీకి పాల్పడుతున్న వర్గాలకు వ్యతిరేకంగా మార్క్స్ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ నిరంతరం అన్ని రంగాల కార్మిక శ్రేయస్సు కోసం ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించిన పార్టీ సిపిఐ అని, వేలాదిమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా నేటికీ సిపిఐ మనుగడ కొనసాగుతుందని,దేశంలో 530 కి పైగా ఉన్న సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయాలని పోరాటాలు నిర్వహించినదని,వర్గ దోపిడీకి పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టించే పార్టీ సిపిఐ అని అన్నారు.
భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కార్మికులకు అన్ని వర్గాల ప్రజలకు,భారత రాజ్యాంగానికి లోబడి పౌరులకు హక్కులు కావాలని, భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం దేశ పాలకులపై అనేక పోరాటాలు నిర్వహించిన పార్టీ సిపిఐ అని, దేశంలో రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, భూ సంస్కరణలు చట్టం లాంటి అనేక ప్రజలకు ఉపయోగపడే విధంగా సిపిఐ పోరాటాలు నిర్వహించి సాధించిన విజయాలుగా చెప్పవచ్చని, దేశంలో ఉన్న ప్రజానీకం స్వేచ్ఛగా తమ హక్కుల కోసం ప్రశ్నించే తత్వాన్ని కలిగించినది ఎర్రజెండా నేననిపార్టీ. దేశంలో 100 సంవత్సరాలు నిండిన ఏకైక పార్టీ సిపిఐ అని,1925లో ఆవిర్భవించిన సిపిఐ 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తి అవుతాయని ఈ నేపథ్యంలో సంవత్సరం పాటు ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటామని, 100 సంవత్సరాల ఉద్యమాలను పోరాటాలను,విజయాలను ప్రజలకు వివరిస్తూ మరింత పట్టుదలతో సీపీఐ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు వెళ్లాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
చిగురుమామిడి మండలంలో మండల ఆవిర్భావం నుండి కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్నదని, అలాంటి మండలంలో గతంలో మండల పరిషత్ అధ్యక్షులుగా జెడ్పిటిసిగా అత్యధిక సర్పంచులుగా ఈ మండలంలో అన్ని గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసింది సిపిఐ ప్రజాప్రతినిధులైనని, తిరిగి మళ్లీ మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి మండలాన్ని కైవసం చేసుకుని మండలంలో ఎర్రజెండా ఎగురవేయాలని వెంకటరెడ్డి సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీపీఐ కి చిగురు మామిడి మండలం గుండెకాయ లాంటిదని అలాంటి మండలంలో నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ మండలంలో అనేకమంది అమరవీరులు ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించిన చరిత్ర ఉందని, అమరవీరుల త్యాగాల ను స్మరించుకుంటూ సిపిఐ ని అన్ని గ్రామాల్లో బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గత వైభవాన్ని తీసుకురావడం కోసం స్థానిక నాయకత్వం పట్టుదలతో కృషి చేయాలని జిల్లా పార్టీ వైపు నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని వెంకటస్వామి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి,జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి,బోయిని అశోక్,గూడెం లక్ష్మీ,మండల కార్యదర్శి నాగెళ్ళి లక్ష్మారెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్న స్వామి,చాడ శ్రీధర్ రెడ్డి,ముద్రకోల రాజయ్య, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, ఇళ్లందుల రాజయ్య,బోయిని పటేల్,బూడిద సదాశివ,ఎనగందుల రాజయ్య,మాజీ మండల కార్యదర్శి తేరాల సత్యనారాయణ,మాజీ జడ్పీటీసీ ఆలేటి రాజిరెడ్డి,సీనియర్ నాయకులు గడ్డం రాంరెడ్డి,మాజీ సర్పంచ్ లు, సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శులు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు