రాత్రికి రాత్రే రోడ్డుపై విగ్రహమా?
రాత్రికి రాత్రే రోడ్డుపై విగ్రహమా?
జోగులాంబ గద్వాల 25 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లాలో ఏది జరిగిన సంచలనమే. నట్ట నడిరోడ్డుపై,జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా, ఎలాంటి అనుమతులు లేకుండగా ముచ్చటగా మూడు రాత్రుల్లో రోడ్డుపై విగ్రహం వెలిసింది.అటుగా వెళ్లేంత వారందరూ చూసి ముక్కున వేలు వేసుకుని ఇదేమి వింతర నాయన అంటూ చర్చించుకుంటున్నారు.ఆ విగ్రహం స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహమా? లేక రాజకీయ నాయకుడి విగ్రహమా? లేక పోరాట యోధులకు సంబంధించిన విగ్రహమా? అనేది తెలియట్లేదు కానీ అటు అధికారుల పర్మిషన్ లేదు,ఇటు ప్రజాప్రతినిధులకు సమాచారం లేదు.అంత హుటాహుటిన మూడు రాత్రుల్లో విగ్రహం ఏర్పాటు చేయాలని ఏ జ్యోతిష్కుడు చెప్పారో తెల్వదు కానీ విగ్రహ ముసుగు తీయకుండగా తెచ్చి పెట్టారు.ఎలాగో విద్వత్ గద్వాల కాస్త విగ్రహాల గద్వాల గా పేరు ఉంది అలాంటప్పుడు అన్ని పర్మిషన్లు తీసుకుని విగ్రహం ఏర్పాటు చేస్తే అయిపోయే దానికి ఇంత హడావుడిగా పెట్టి దేనికోసం రాద్దాంతం చేస్తున్నారో,ఎవరి మెప్పు పొందడం కోసం ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటున్నారు పురప్రముఖులు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.