రాజీవ్ గాంధీ ఆశయాలను సాధిస్తాం
రాజీవ్ గాంధీ ఆశయాలను సాధిస్తాం*
-సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి
తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా ప్రతినిధి
మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని, వారి ఆశయాలను సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని టిపిసిసి సీనియర్ ఉపాద్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ హత్య గావింపబడిన స్థలం శ్రీపెరంబుదూరు నుండి ప్రారంభించబడిన
రాజీవ్ జ్యోతి యాత్ర ఈ రోజు సూర్యాపేట చేరుకున్న సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు , కార్యకర్తలు రాజీవ్ జ్యోతి యాత్రికులకు దురాజ్ పల్లి వద్ద ఘన స్వాగతం పలికి, ఈనాడు కార్యాలయం వద్ద కల రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించి, రాజీవ్ జ్యోతిని ప్రదర్శిస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన రాజీవ్ గాంధీ దేశంకోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన మహానీయుడని కొనియాడారు.
అనంతరం రాజీవ్ జ్యోతి యాత్ర లో పాల్గొంటున్న చెన్నై కార్పోరేటర్ శామ్యూల్ ఆధ్వర్యంలోని బృందం సభ్యులు, టిపిసిసి సీనియర్ ఉపాద్యక్షులు సూర్యాపేట నియోజకవర్గ
ఇన్ చార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని వారి నివాసంలో కలిసి యాత్ర వివరాలు తెలియజేసి రాజీవ్ జ్యోతిని అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి రాజీవ్ జ్యోతి యాత్ర సభ్యులందరితో మాట్లాడి, శామ్యూల్ బృందాన్ని అభినందిస్తూ, వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది.
రాజీవ్ జ్యోతి యాత్ర జిల్లా కాంగ్రెస్ కార్యాలయం చేరుకున్న సందర్భంగా యాత్రికులకు స్వాగతం పలికిన అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర రావు మాట్లాడుతూ ఈ యాత్ర 10 రాష్ట్రాల గుండా దాదాపు 3000 కి.మీ.లు కొనసాగి న్యూఢిల్లీ లోని రాజీవ్ స్మారక స్థలం వీర్ భూమి కి చేరుకుని సర్వమత ప్రార్థనలు చేసిన అనంతరం ముగుస్తుందని అన్నారు. ఈ యాత్ర దేశ ప్రజలకు యువతకు స్ఫూర్తి దాయకంగా ఉంటుందని అన్నారు.
ఎటువంటి అసౌకర్యం జరుగకుండా, యాత్ర సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేసిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి కి, స్థానిక కాంగ్రెస్ నాయకులకు రాజీవ్ జ్యోతి యాత్ర లో పాల్గొంటున్న యాత్రికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు బైరు శైలేందర్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వీరన్న నాయక్, కందాళ వెంకట రెడ్డి, కౌన్సిలర్ లు ఎలిమినేటి అభినయ్, గండూరి రమేష్, కుంభం రాజేందర్, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు ఆలేటి మాణిక్యం, చెంచల శ్రీనివాస్, నాగుల వాసు, రుద్రంగి రవి, అక్కినేపల్లి జానయ్య, తంగెళ్ళ కరుణాకర్ రెడ్డి, గడ్డం వెంకన్న, రావుల రాంబాబు, కక్కిరేణి శ్రీనివాస్ గౌడ్, ఆరెంపుల రాజు, గాజుల రాంబాయమ్మ, ఇస్రార్ అహ్మద్, నర్సిరెడ్డి, పచ్చిపాల వెంకన్న, శిగ శ్రీనివాస్, చెంచల నిఖిల్, నరేందర్ నాయుడు, ఎలగందుల సాయినేత, తదితరులు పాల్గొన్నారు..