జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు

Aug 12, 2024 - 19:37
 0  5
జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు

 సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, పర్యాటక శాఖ మరియు ఎక్సైజ్  శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం  రెడ్డి  తో కలిసి జిల్లాలో పర్యాటకశాఖ అభివృద్ధి చేయడంలో భాగంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా మంత్రులు స్థానిక శాసనసభ్యులు అయినా కొత్తగూడెం శాసనసభ్యులు  కూనంనేని  సాంబశివరావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, అశ్వరావుపేట శాసనసభ్యులు  జారే ఆదినారాయణ, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, సత్తుపల్లి శాసనసభ్యులు మట్ట రాగమయి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి కిన్నెరసాని ప్రాజెక్టులో బోటులో విహరించి కిన్నెరసాని అభయారణ్య ప్రాంతాన్ని, దీవులను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కిన్నెరసాని ప్రాజెక్ట్ వివరాలు నీటి నిలువల గురించి ఉపముఖ్యమంత్రి మరియు పర్యట శాఖ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా అందరికీ భోజనాలు వడ్డించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు.

 ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ 

కిన్నరసాని అనేది చాలా చరిత్రత్మకమైనది. దీనిగురించి చాలా కావ్యాల్లో, అనేక గ్రంథాల్లో కిన్నెరసాని ప్రస్తావన ఉంది.. చుట్టూ పచ్చని చెట్లు.. మధ్యలో విశాలమైన నీటి వనరు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి కిన్నెరసాని ప్రాజెక్టు అన్ని రకాలుగా అవకాశం ఉంది అన్నారు. పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్ కు పర్యాటక రంగం అభివృద్ధి కొరకు తగిన చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు.ఈ నేపథ్యంలోనే సంబంధిత ఇరిగేషన్, ఫారెస్ట్, విద్యుత్తు, పర్యాటక ఇతర సమన్వయంతో అభివృద్ధి చేస్తాం. వరల్డ్ బెస్ట్ ఒక కన్సల్టెన్సీ ని ఎంపిక చేసి కిన్నెరసాని ప్రాజెక్టు అభివృద్ధి పనులు అప్పగించే ఆలోచనలో ఉన్నాం. 
 అధికారులు ఖమ్మం జిల్లా ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపితే కేంద్ర నిధులతో చేసుకొని ముందుకు వెళ్తాం అన్నారు. పర్యాటక పటంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను  తీర్చిదిద్దుతాం అన్నారు.

 అనంతరం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. 

 జిల్లాను పర్యాటకం అనే పదానికి  ఒక పర్యాయపదంగా తీర్చిదిద్దుతాం.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పర్యాటక ప్రాంతాలను కోరుతున్నాను నెలలో ఒకసారి అయినా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పర్యాటక ప్రాంతాల్లో విడిది చేయాలి దీని ద్వారా పర్యాటక ప్రాంతాలు ప్రాచుర్యంలోకి  వస్తాయిఅన్నారు. దీని ద్వారా పర్యాటకుల సంఖ్యతో పాటు ఆదాయం పెరుగుతోంది
టూరిజం ప్రమోషన్ లో  భాగంగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించాం కిన్నెరసాని రిజర్వాయర్ లో బోటులో విహరించారు
కెన్నెరసానిని వెడ్డింగ్ డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.హైల్యాండ్స్ లో కాటేజీల నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు, సాధ్యాసాధ్యాలపై చర్చించారు. జిల్లాను పర్యాటకం అనే పదానికి పర్యాయపదంగా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. అనంతరం10.77 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న కిన్నెరసాని లో జరుగుతున్న కాటేజీ నిర్మాణ పనులపురోగతిని పరిశీలించారు.

అనంతరం కొత్తగూడెంలో రూ. 12.36 కోట్లతో నిర్మిస్తున్న  హరిత హోటల్, కన్వెన్షన్ సెంటర్ పనుల పురోగతిని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని హంగులతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మూడు నెలల్లో పనులు పూర్తి అవుతాయని అధికారులు వివరించారు.

 స్థానిక శాసనసభ్యులు కోననేని సాంబశివరావు మాట్లాడుతూ కిన్నెరసాని అభయారణ్యంలో  ఉన్న జింకల పార్కును విస్తరణ చేపట్టడం ద్వారా రాష్ట్రంలోనే అతిపెద్ద జింకల పార్కుగా ఏర్పాటు చేయవచ్చు అని, అదేవిధంగా కిన్నెరసాని తీగల వంతెన మరియు ట్రెక్కింగ్ ను ఏర్పాటు చేయాలని పర్యటక శాఖ మంత్రికి వినతి పత్రం అందజేశారు.

 ఈ కార్యక్రమంలో టూరిజం జిఎం హోటల్స్ నాథన్ కట్టి, టూరిజం డి ఈ రామకృష్ణ, ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య, అటవీశాఖ ఉన్నతాధికారులు, మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333