బీసీ కులాల గణన చేపట్టాలి.

Jun 11, 2024 - 20:14
 0  3

జోగులాంబ గద్వాల11  జూన్  2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల.  ఆరు నెలల లోపు  బీసీ కులాల గణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని  హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు ముగుస్తున్న  బీసీ కులాల గణన, చేపట్టకపోగా,సకాలంలో నిర్వహించాల్సిన సర్పంచ్  ఎన్నికలను వాయిదా వేయడం వల్ల  గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతుందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, బీసీ కులాల గణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించి  ఎన్నికలు నిర్వహించాలని జోగులాంబ గద్వాల జిల్లా రెవెన్యూ కలెక్టర్ వెంకటేశ్వర్లు కు మంగళవారం బీసీ సేన రాష్ట్ర, జిల్లా నాయకులు మెమోరాండం ను అందజేశారు. బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణయాదవ్, బిసి సంక్షేమ సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ బాబు లు అనంతరం  మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వం  ఒకేరోజులో సకలజనుల సర్వే నిర్వహించి సబండవర్గాల ప్రజల సంపూర్ణ సమాచారాన్ని, సేకరించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే  వారం గడువు లోపల  రాష్ట్రంలోని బీసీల కులాల జనాభా గణన సంపూర్ణంగా చేపట్టవచ్చు అని, ఆలస్యం చేయడం కేవలం రాజకీయ కారణమేనని, తక్షణమే ముఖ్యమంత్రి, బీసీ కులాలగణన చేపట్టి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని యెడల బిసి సేన ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో దామోదర్, శ్రీను యాదవ్, వెంకట్ రాములు, గొడుగు నర్సిములు,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333