యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

Apr 7, 2025 - 23:26
Apr 8, 2025 - 19:39
 0  7
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

పోలీస్ కార్డన్ అండ్ సెర్చ్,73 వాహనాలు సీజ్ : డిఎస్పి పార్థసారధి.

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని డీఎస్పీ పార్థసారథి అన్నారు. సోమవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధి కుడకుడ గ్రామంలో రూరల్ సీఐ రాజశేఖర్, పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు అధ్వర్యంలో పోలీసు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించి తనిఖీలు చేశారు.ఈ తనిఖీల్లో నివాసాలు, వాహనాలు, దుకాణాలు పోలీసులు పరిశీలించారు.సరైన అనుమతి పత్రాలు లేని 73 వాహనాలు సీజ్ చేశారు. అనంతరం కుడకుడ ప్రభుత్వ స్కూల్ లో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం ఏర్పాటు చేసి డిఎస్పి పార్థసారథి మాట్లాడారు జిల్లా ఎస్పి నరసింహ ఆదేశాల మేరకు సూర్యాపేట డివిజన్ నందు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత ఆదర్శంగా ఉండాలని పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువై నేరాలను అరికట్టడం పోలీసుల ఉద్దేశ్యం అన్నారు. గొడవలు పడి జీవితం జైలు పాలు చేసుకోవద్దన్నారు. యువత గ్రూపులుగా ఏర్పడి వివాదాలు పెట్టుకుని దాడులు చేసుకుని కేసుల్లో చిక్కుకోవద్దని సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలి, చట్టానికి లోబడి నడుచుకోవాలని తెలిపారు. చివ్వేంల, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఎస్ఐ లు, సుమారు 90 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333